24 March, 2026 | 11:48 PM

19 మందికి రూ.1,93,000 జరిమానా

24-03-2026 10:14 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 19 మంది పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. జడ్జి విచారణ జరిపి 19 మందికి కలిపి రూ. లక్షా 93 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ ప్రవీణ్ పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి రూ.10వేలు జరిమానా విధించారని తెలిపారు.