అయ్యప్ప స్వామి గుట్టకు కరెంటు స్తంభాల ఏర్పాటు
01-04-2026 08:59 PM
చిట్యాల,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి గుట్టకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో బుధవారం కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశారు. చిట్యాల మండలం ఊరుమడ్ల నుండి వేంబాయికి వెళ్లే దారిలో ఉన్న గుట్ట వద్ద తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి కరెంటు డిపార్ట్మెంట్ ఏడితో మాట్లాడి దేవస్థానానికి సరిపడా స్తంభాలు కరెంటు ట్రాన్స్ఫారం బుడ్డి ఇప్పించారు. ఈ విషయంలో సహకరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం కి అయ్యప్ప స్వాములు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




