18 July, 2026 | 7:17 PM

Breaking News

మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరగాలి   •   నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •  

చాకలి ఐలమ్మ, రుద్రమదేవి స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి

10-03-2026 12:00 AM

ఎమ్మెల్యే కనకయ్య 

ఇల్లందు టౌన్, మార్చి 8, (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ, రుద్రమదేవి వంటి వీరనారులు ధైర్యసాహసాలతో చరిత్రలో నిలిచారని, వారి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, మహిళా కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.