టేకులపల్లి పాఠశాల ఘర్షలపై సమగ్ర విచారణ జరిపించాలి
పి డి ఎస్ యూ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో విద్యార్థుల పరస్పర ఘర్షణ, దాడి పట్ల సమగ్ర విచారణ జరపాలి, పాఠశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతికి పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణయ్ కుమార్, పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్ మాట్లాడుతూ.... టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజుల క్రితం 10వ, తరగతి విద్యార్థులు తరగతి గదిలో ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటన తరగతులు జరుగుతున్న సమయంలోనే జరిగింది. విద్యార్థులే వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. తరగతుల నిర్వహణ సమయంలో ఇంత జరుగుతున్న ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. సంఘటనపై ఎలాంటి విచారణ, వివరణ లేకుండానే ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు టి.సి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
ఇంతటి తీవ్రమైన ఘటన జరిగినప్పటికీ పాఠశాలకు కూత వేటు దూరంలోనే ఉన్న సదరు విషయం పట్ల మండల విద్యాశాఖ అధికారి (ఏం.ఈ.ఓ) నేటి వరకు కనీసం స్పందించలేదు. పైగా విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతుంది. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల, తన విధి నిర్వహణ పట్ల ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేది ఈ సంఘటన ద్వారా తేట తెల్లమైంది. పాఠశాలలో విద్యార్థులు గ్రూపులుగా విడివడి దాడి చేసుకోవడం వాటిని వీడియోలు తీయడం కానీ అటువంటిది పాఠశాల వాతావరణం కలుషితమైనదనేది స్పష్టం అవుతున్నది. అంతే కాకుండా తెలుగు ఉపాధ్యాయురాలు, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తరగతి గదిలో విద్యార్థులపై దుర్భాషలాడుతున్నారని విద్యార్థులు తెలియజేస్తున్నారు.
పాఠశాల టీచర్ల మధ్య అనేక వివాదాలు ఉన్నాయనేది కూడా చర్చ నియాంశంగా ఉందన్నారు .మధ్యాహ్న భోజనంలో పూర్తిగా నాణ్యత లోపించింది. నీళ్ల వంటి చారు, పురుగుల అన్నం విద్యార్థులకు పడ్డిస్తున్నారు. బారులకు మరుగుదొడ్లు లేవు, బాలికలకు సరిపడా మరుగుదొడ్లు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భోజనం టైం లో విద్యార్థులు గ్రౌండ్లో ఎండలో నిలబడి తినాల్సిన పరిస్థితి ఉందని, ఆర్వో వాటర్ ప్లాంట్ సరిగా పనిచేయడం లేదని విద్యార్థులు తాగునీరు సమస్య ఏర్పడిందని ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయని ఇలాంటి సమస్యల వలన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కావున స్కూల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా విద్యార్థులకు ఘర్షణ పట్ల తక్షణమే సమగ్ర విచారణ జరిపి, విధుల నిర్వహణలో మరియు విద్యార్థుల పర్యవేక్షణ నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిపై, ఏమి పట్టనట్టు ఈరోజు వరకు కూడా పాఠశాలల సందర్శించని టేకులపల్లి మండల విద్యాశాఖ అధికారి ఇరువురిని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కలుషితమైన పాఠశాల వాతావరణ తక్షణమే కాపాడాలని సంబంధిత అధికారులను వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.






