17 June, 2026 | 4:32 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు

17-03-2026 01:19 AM
  1. మొదటి విడుత నిర్మాణానికి కార్యాచరణ
  2. అర్హులకే ఇళ్లు, అక్రమార్కులకు చెక్
  3. అనర్హుల స్ధానంలో అర్హులకు కేటాయిస్తాం
  4. మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, పొన్నంతో కలిసి పొంగులేటి సమీక్ష

హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి) : క్యూర్ ( కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో  ఇందిర మ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్దం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరా బాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్ధలాలను గుర్తించాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రు లు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్లతో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక  ఉండాలని ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు తలోగ్గవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దె కు ఇస్తున్నవారికి, ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి నోటీసులు జారీ చేయాలని , నోటీసులకు స్పందించని వారి ఇళ్లను రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ఆదేశించారు.  నోటీసులపై స్పందించిన లబ్దిదారుల నుంచి బాండు పేపరుపై తాము ఇక్కడే నివాసం ఉంటామని లేదంటే రద్దు చేసే అధికారం ప్రభు త్వానికి అప్పగిస్తూ వారి నుంచి హామీ పొందాలని సూచించారు.  

మౌళిక వసతులు కల్పించాలి 

నాలుగు జిల్లాల పరిధిలోగల కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వం టి  వసతులను తప్పని సరిగా కల్పించాలని, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ సహ కారాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 22వేల ఇళ్లకు విద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎం డీ, వీపీ గౌతమ్, హైదరాబాద్,  కలెక్టర్లున్నారు.