21 July, 2026 | 9:14 PM

Breaking News

తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •   వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్   •   ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం   •   ఎల్ నీనో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు   •   బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వల్లే మేడ్చల్ ప్రజలకు కష్టాలు   •  

భారత్‌కు తొలి డెంగ్యూ వ్యాక్సిన్

21-07-2026 12:27 AM
  1. ‘క్యూడెంగా’కి డీసీజీఐ ఆమోదం
  2. జపాన్‌కు చెందిన టకేటా కంపెనీ తయారీ

న్యూఢిల్లీ, జూలై 20 : డెంగ్యూను నివారించే తొలి వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపిం ది. జపాన్‌కు చెందిన టకేడా బయోఫార్మా సూటికల్స్ కంపెనీ తయారు చేసిన ‘క్యూడెం గా’ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాలు గు నుంచి 60 ఏళ్ల వయస్సు వారు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. క్యూడెంగా (టీఏకే-003) ను జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకెడా అభివృద్ధి చేసింది. ఇది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. అంటే డెంగ్యూ వైరస్‌లోని నాలుగు రకాలైన డెన్వీ-1, డెన్వీ-2, డెన్వీ-3, డెన్వీ-4పై రోగనిరోధక శక్తిని పెంచేలా రూపొందించారు. ఈ వ్యాక్సిన్‌ను 0.5 ఎంఎల్ చొప్పున మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు.

డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటికే ఆసియాలోని 43 దేశాల్లో ఆమోదం పొందింది. భారత్‌లో ఏటా వేలాది మంది దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ బారిన పడుతున్నారు. చాలా మంది మృతి చెందుతున్నారు. 2025 లో సుమారు లక్షకు పైగా కేసులు నమోద య్యాయి.

ప్రపంచంలో నమోదయ్యే డెంగీ కేసుల్లో మూడోవంతు భారత్‌లోనే నమోదు అవుతున్నవేళ.. ఈ వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం తెలుపడం గమనార్హం. సుమారు నాలుగున్నరేళ్ల పరిశీలనలో ఆసుపత్రిలో చేరే పరిస్థితిని 84 శాతం వరకు తగ్గించినట్లు గుర్తించారు. ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారిత డెంగ్యూ కేసులపై దాదాపు 61 శాతం రక్షణ కల్పించినట్లు వెల్లడైంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్‌కు చెందిన ‘బయోలా జికల్-ఈ’తో టకెడా ఇప్పటికే ఉత్పత్తి ఒప్పం దం కుదుర్చుకుంది. ఏడాదికి ఐదు కోట్ల డోసుల తయారీ లక్ష్యంగా పెట్టుకుంది.