21 July, 2026 | 5:48 PM

రాజకీయం చేయొద్దు

21-07-2026 12:30 AM
  1. అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టు
  2. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని హితవు

న్యూఢిల్లీ, జూలై 20: అయోధ్య రామాల యంలో విరాళాల చోరీ కేసును రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఓ నేరా నికి సంబంధించిన అంశం మాత్రమేనని, సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని తెలిపింది.

అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును సో మవారం విచారణ చేసింది. యూపీ ప్రభు త్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యా ప్తులో తేలిన విషయాలను కోర్టుకు తెలియజే యాలని తెలిపింది. కేసు విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.