ఇకనైనా మేల్కొంటారా?
బెడిసికొట్టిన గంభీర్ వ్యూహాలు
సన్నద్ధత లేకపోవడమే ముఖ్య కారణం
స్వింగ్ పిచ్‌లపై బ్యాటర్ల ఫ్లాప్ షో
సరిగ్గా మూడు వారాల క్రితం ఐర్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడు వరల్డ్ నెంబర్ 1, ఐపీఎల్‌లో దుమ్మురేపిన కుర్రాళ్ళు, సీనియర్లు.. జట్టుపై భారీ అంచనాలు.. కట్ చేస్తే తర్వాత సీన్ మొత్తం రివర్స్..ఐర్లాండ్ చేతిలో 0 తో వైట్‌వాష్, ఇంగ్లాండ్ గడ్డపైనా 0- తో వైట్ వాష్..ఈ ఫలితాలతో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కూడా పోయింది. ఈ రెండు సిరీస్‌ల ఫలితాల తర్వాత భారత్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి ?
లండన్, జూలై 12: అసలు వరల్డ్ ఛాంపియన్ టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. ముందు పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ పరాభవం.. ఇం గ్లాండ్ గడ్డపైనా అదే సీన్ రిపీట్. బౌలర్లు సమిష్టిగా విఫలమవగా, వారికి పోటీగా బ్యాటర్లు సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
నిజానికి విదేశీ పిచ్‌లపై మరోసారి భారత బ్యాటర్ల బలహీనత ఈ సిరీస్‌లతో స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ ఆద్యంతం ఫ్లాట్ పిచ్‌లపై పరుగుల వరద పారించి, కాస్త బౌన్స్, స్వింగ్ ఎదురయ్యే ఇంగ్లీష్ పిచ్‌లపై చేతులెత్తేశారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం రోజులు కూడా సమయం లేకపోవడం పూర్తిస్థాయిలో అక్కడి పిచ్‌లకు, పరిస్థితులకు సన్నద్ధత దొరకలేదు. అందుకే అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఈ సిరీస్‌ల ద్వారా భారత్ ఆట గాళ్లు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నా యి.
ముఖ్యంగా బ్యాటర్లు కేవలం ఫ్లాట్ పిచ్‌లపైనే కాకుండా, బంతి బాగా స్వింగ్ అయ్యే విదేశీ పరిస్థితులకు తగినట్లుగా టెక్నిక్ మెరుగుపరుచుకోవాలి. విరాట్ కోహ్లీ వంటి సీని యర్లు గతంలో పిచ్‌పై నీళ్లు చల్లించి మరీ స్వింగ్ కోసం ప్రాక్టీస్ చేసిన విధానాలను యు వ ఆటగాళ్లు అనుసరించాలి.టీ20ల్లో దూకుడే మంచిదే కానీ పరిస్థితులకు తగ్గట్టు ఆడడం కూడా ముఖ్యమే. ఇంగ్లాండ్ బ్యాటర్లు భారీస్కోర్లు చేసిన పిచ్‌పై మన జట్టు 76 పరుగులకే ఆలౌటయ్యేంత పరిస్షితి ఎందుకొచ్చిందన్నది ఆలోచించుకోవాలి.
వైట్-బాల్ క్రికెట్లో వ్యూహాత్మక లోపాలను సరిదిద్దుకోవడానికి బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే సీనియర్లు, యువ ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించడం కూడా ఓటముల కారణం. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యాలను అధిగమించి అన్ని విభాగాల్లోనూ నిలక డను ప్రదర్శించడం నేర్చుకోవాలి.ఇంగ్లాండ్ పిచ్‌లపై లభించే అదనపు సీమ్, స్వింగ్‌ను ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధత అవసరం. ఇది దృష్టిలో ఉంచుకుని ఏ విదేశీ సిరీస్‌కైనా ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం రెండువారాల ప్రాక్టీస్ ఉండాల్సిందే.
ఐపీఎల్‌లో మునిగిపోయి నేరుగా ఇక్కడకు వచ్చి సిరీస్ ఆడేద్దాం అంటే మాత్రం ఫలితాలు ఇలాగే ఉంటాయని మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. అలాగే కీలక ఆటగాళ్లకు బ్యాకప్ పై మరింత దృష్టి సారించాలని అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బు్రమ్రా, హార్థిక్ వంటి ఆల్‌రౌండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల భారత బౌలింగ్ విభాగం తేలిపోయింది. వీరు లేనప్పుడు కూడా జట్టు ను నడిపించగల సమర్థవంతమైన ప్రత్యామ్నాయ ఫాస్ట్ బౌలర్లను, పేస్ ఆల్‌రౌండర్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయాలి.
అలాగే ఈ పర్యటనలో భారత్ ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉంది. క్యాచ్‌లు వదిలేయడంతో భారీ గా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ఫీల్డింగ్ మరింత మెరుగవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. కాగా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తూనే, జట్టును సమర్ధవంతంగా నడిపే వ్యూహాలను సిద్ధం చేసే భాధ్యత కూడా కోచ్ గంభీర్ పై ఉంది. ఈ తప్పులను సరిదిద్దుకుని భారత జట్టు త్వరలోనే ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లోనైనా పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.






