8 June, 2026 | 6:18 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

INDIA కూటమి సమావేశం.. తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే..!

08-06-2026 04:58 PM

న్యూఢిల్లీ: ఇండియా కూటమి(INDIA Bloc Meeting) సమావేశానికి 25 పార్టీలు హాజరయ్యాయని ఏఐసీసీ అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge) తెలిపారు. ఈ భేటీలో ఐదు అంశాలపై కీలకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) పిలవాలన్నారు. ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల తో పాటు ఇతర అంశాలపై అఖిలపక్షంలో చర్చించాలని కోరారు.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు SIRపై(Special Intensive Revision) లేఖ రాస్తామని తెలిపారు. ప్రతి రెండు నెలలకోసారి ఇండియా కూటమి సమావేశం జరుపుతామని ప్రకటించారు. ఆగస్టు 8 తేదీన హైదరాబాదులో ఇండియా కూటమి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో(Monsoon Session of Parliament) ప్రతిరోజు ఉదయం పార్లమెంట్ కోఆర్డినేషన్ కోసం ఇండియా కూటమి సమావేశం కొనసాగుతుందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇండియా కూటమి సమావేశానికి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గైర్హాజరయ్యాయి.

INDIA bloc meeting: INDIA bloc takes 5 key decisions