15 August, 2026 | 10:32 AM

కూసుమంచిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 10:15 AM

కూసుమంచి, (విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మెన్ వెన్నపూసల సీతారాములు జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీతారాములు  మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి మరియు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.