వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కందుకూరు, మే 11(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల లో మొక్కజొన్న 2,400(క్వింటాలుకు), వరి (A-గ్రేడ్) 2,389,వరి (సాధారణ రకం) 2,369 మద్దతు ధర ఇస్తున్నట్టు పేర్కొన్నారు.సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం అదనంగా 500 బోనస్ ప్రకటించారు.
దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని చైర్మన్ కోరారు. నగదు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంద ని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులు తమ వెంట ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు మరియు ఏఈఓలకు టోకెన్ సమర్పించడం తో పాటు ఆధార్తో ఫోన్ నంబర్ మరియు పాస్ బుక్ లింక్ చేయించుకోవలన్నారు.కేంద్రాల వద్ద అధికారులు రైతులకు నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు. ధాన్యం నాణ్యతా ప్రమాణాల మేరకు (తేమ లేకుండా) తీసుకురావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.






