22 June, 2026 | 1:33 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

ఇల్లెందులో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కొద్దు

07-02-2026 12:00 AM
  1. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం 
  2. ప్రజాపాలనను ఆశీర్వదించి అభివృద్ధి చేసుకుందాం 
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

ఇల్లెందు, ఫిబ్రవరి 6,(విజయక్రాంతి): ఇల్లెందు పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ రంగు రంగుల కండువాలు వేసుకుని టింగ్ టింగ్ అంటూ వచ్చే మోసగాళ్లను నమ్మవద్దని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉన్నందున మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అధికారంలోలేని పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసేది ఎవరణ ఓటర్లు గుర్తించాలని అన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో రూ.102 కోట్ల నిధులతో వంద పడకల ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బుగ్గ వాగు ప్రక్షాళన వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.

రూ.200 కోట్లతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరలోనే ప్రారంభించుకుంటున్నామని, రూ.45 కోట్లతో ఏటీసీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలను, హాస్పిటిక్స్ కు రూ.200 రూపాయలు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఇల్లందు పురపాలకంలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రెబల్స్ సైతం ఆలోచించాలని వారికి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 20వ వార్డులో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ప్రజలకు అందిస్తామన్నారు.

గోవింద్ సెంటర్లో ముస్లిం మైనార్టీలకు షాదీ ఖానా భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పూసపల్లి ఓసిని ప్రారంభించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి వెలగబెట్టలేని నాయకులు నేడు అధికారంలో లేకుండా ఏం సాధిస్తరో ప్రజలకు చెప్పాలన్నారు.

మంత్రిగా ఇల్లందు పురపాలక ప్రజలకు అండగా ఉంటానని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఏదల్లపల్లి అనసూర్య, దొడ్డ డానియల్, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం తదితరులు పాల్గొన్నారు.