16 August, 2026 | 3:18 AM

ఈ వారం వార్తల్లో..

16-08-2026 12:19 AM

కోలుకున్న సుఖ్‌బీర్

పంజాబ్ ముఖ్యమంత్రిగా సుఖ్‌బీర్ సింగ్  సేవలందించారు. శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాష్ సింగ్ బాదల్ ఈయన తండ్రే. ప్రస్తుతం పార్టీ చీఫ్‌గా  సుఖ్‌బీర్ సింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై ఇటీవల ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో ఆయన కుడి చేతికి గాయమైంది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇవాళో రేపో మళ్లీ ప్రజాజీవితంలోకి రానున్నారు.

చంద్రశేఖరన్ ‘టాటా’!

టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి ఇటీవల ఎన్.చంద్రశేఖరన్ వైదొలిగారు. సంస్థలో ఆయన దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ చైర్మన్ వరకు ఎదిగారు. సంస్థ ప్రగతిలో ఆయన పాత్ర ముఖ్యమైనది. బోర్డులో ఏం గడబిడ అయిందో, ఏం అభిప్రాయ భేదాలు వచ్చాయో స్పష్టంగా తెలియదు గానీ.. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు.