5 March, 2026 | 1:32 AM

రెండేళ్లలో 60 సార్లు ఐఏఎస్‌ల బదిలీలు

05-03-2026 12:01 AM

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): రెండేళ్లలో సుమారు 60 సార్లు రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీ ఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఉన్నతాధికారుల బదిలీలు కూడా దాదాపు 60 సార్లకు పైగానే జరిగాయని తెలిపారు. పరిపాలనలో స్థిరత్వం లేకపోవడం, ఒక స్పష్టమైన దిశా నిర్దేశం లేకపో వడం వల్లే ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరుగుతున్నాయని విమర్శించారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల విషయానికొస్తే, తన పదవిని పదిలం చేసుకో వడానికే 60 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఒక దశ, దిశలేని ప్రభుత్వంలాగా పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతోందని ప్రభాకర్ స్పష్టం చేశారు.