టీఎంసీపై రూ.100 కోట్ల దావా వేస్తా
మెస్సీ టూర్ ప్రమోటర్ ప్రకటన
ముంబై, మే 6 : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్ టూర్ ప్ర మోటర్ శతద్రు దత్తా సంచలన ప్రకటన చే శారు. టీఏంసీపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 13వ తేదీన కోల్‌కత్తాలోని సాల్డ్‌లేక్ స్టేడియంలో మెస్సీ క్రీడా కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసిం ది. దాదాపు గంటసేపు సాగాల్సిన ఈ కార్యక్రమం నుంచి మెస్సీ కేవలం 25 నిమిషా ల్లోనే అసంతృప్తితో వెళ్లిపోయాడు. దీంతో భారీ మొత్తానికి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహం చెందిన సుమారు 35 వేల మంది అభిమానులు స్టేడియం ఆస్తులను ధ్వంసం చేస్తూ హింసకు దిగారు.
ఈ గందరగోళానికి నిర్వాహకుడే కారణమంటూ పోలీసులు శత ద్రు దత్తాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆ యన సుమారు 37 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా బెంగాల్ ఎన్నికల్లో టీఎం సీ ఓటమితో శతద్రు దత్తా సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టారు. ముఖ్యం గా ఓడిపోయిన క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అక్కడ ఫోటోలు తీయవద్దని తాను మంత్రికి పదేపదే చెప్పినా ఆయన వినలేనదీ, తన అనుచరులతో మెస్సీ చుట్టూ గుమిగూడి నా నా హంగామా సృష్టించారన్నారు. వారి హడావిడితో మెస్సీ విసిగిపోయి త్వరగా వెళ్లిపోయానీ, అది చూసి ప్రేక్షకులు రెచ్చిపోయా ని రాసుకొచ్చారు. తన ప్రతిష్టను మంటగలిపినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.






