యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
17-07-2026 03:50 PM
గుండాల,(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, సమాజాభివృద్ధికి పాటుపడాలని జిల్లా యువజన సంఘాల అధికారి రాంబాబు అన్నారు. మండల కేంద్రంలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో మండల్ వికాస్ అభియాన్ ముగింపు సభలో మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులు గ్రామస్థాయిలో యువజన సంఘాలను ఏర్పాటు చేసుకొని గ్రామ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని, సేవా దృక్పథంతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య, నవ చైతన్య యువజన సంఘం నాయకులు బి వినయ్ మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత మద్యపానానికి అలవాటు కావద్దని కోరారు. యువజన, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసం శివ, కే సంతోష్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.






