7 May, 2026 | 3:07 AM

ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు

07-05-2026 01:17 AM

బెంగళూరుకు నిరాశే

ముంబై, మే 6 : ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. 19వ సీజన్ ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. నిజానికి గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు హోంగ్రౌండ్ లో ఫైనల్ జరగడం ఆనవాయితీ. కానీ బీసీసీఐ ఈ సారి బెంగళూరుకు షాకిచ్చింది. తమ నిర్థేశిత నిబంధనలకు లోబడి స్థానిక అసోసియేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో వేదికను మార్చినట్టు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.

అయితే టికెట్ల వివాదమే అసలు కారణంగా చెబుతున్నారు. స్థా నిక అసోసియేషన్లు, అధికారుల నుంచి టికె ట్ల కోసం డిమాండ్లు విపరీతంగా ఉండడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముఖ్యం గా కర్ణాటక ఎమ్మెల్యేలు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి వీవీఐపీ కాంప్లిమెంటరీ పాసుల కోసం అసోసియేషన్ తో పాటు ఫ్రాంచైజీని విపరీతంగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను అక్కడ నిర్వహిస్తే లేనిపోని తలనొప్పులు ఎదురయ్యే అవకాశముందని భావించే వేదికను మార్చినట్టు అర్థమవుతోంది.

అలాగే అ హ్మదాబాద్ కెపాసిటీ కూడా చిన్నస్వామి కంటే మూడు రెట్లు ఎక్కువ. దీంతో బీసీసీఐ మరో ఆలోచన లేకుండా ఫైనల్ మ్యాచ్ ను నరేంద్రమోదీ స్టేడియానికి తరలించింది. కాగా లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు మే 24న ముగియనుండగా.. మే 26న క్వాలిఫైయర్- జరగ నుంది. ఈ మ్యాచ్‌కు  ధర్మశాలలోని హెచ్పిసిఎ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. పాయిం ట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు దీనిలో తలపడతాయి. దీనిలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉం టుంది. మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ కు న్యూ చండీగఢ్ ఆతిథ్యమివ్వనుంది. 

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ 

మే 26 : క్వాలిఫైయర్ 1 ధర్మశాల

మే 27 : ఎలిమినేటర్ న్యూ ఛండీగడ్

మే 29 : క్వాలిఫయర్ 2 న్యూ చండీగఢ్

మే 31 : ఫైనల్ అహ్మదాబాద్