25 February, 2026 | 11:06 PM

మాట ఇచ్చి నిలబెట్టుకున్నాను

25-02-2026 09:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ సర్పంచ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో ఎవరైనా చనిపోతే తనవంతు సహాయంగా అంత్యక్రియల కోసం ఐదు వేల,,రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగిందని అదే మాట ప్రకారం సత్యబోయిన దుర్గయ్య, చాకలి దుర్గయ్యలు స్వర్గస్తులైనందున వారి ఇరువురి కుటుంబాలకు తనవంతు సాయంగా అంత్యక్రియల నిమిత్తం రూ.5000 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు.

మాట ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం తాను ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నంతకాలం తప్పకుండా మాట మీద ఉండి నిలబెట్టుకొని సహాయం అందజేస్తానన్నారు.గ్రామ ప్రజల ఆశీస్సులు సహాయ సహకారాలు ఉంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు.