1 August, 2026 | 11:00 PM

నిరుపేద విద్యార్థులకు చేయూత

01-08-2026 10:05 PM

గ్రేస్ సర్వీస్ సొసైటీ నుండి 115 మందికి విద్యా సామగ్రి

సింగసముద్రం చైల్డ్ కేర్ కేంద్రంలో సేవా కార్యక్రమం

చర్ల,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సింగసముద్రం గ్రామంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని జిఎస్ఎస్ చైల్డ్ కేర్ కేంద్రంలో చదువుతున్న 115 మంది నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, గ్రేస్ సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, చైల్డ్ కేర్ సెంటర్ ఇన్‌చార్జ్ పూజారి లక్ష్మీ నారాయణ, చైల్డ్ కేర్ సెంటర్ సిబ్బంది, సంస్థ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా వారి చదువుపై ఆసక్తి పెరుగుతుందని, డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీని వారు ప్రత్యేకంగా అభినందించారు. బ్యాగులు, పుస్తకాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ చదువుకు సహకరించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.