టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ హీరోస్
27-06-2026 12:12 AM
రగ్బీ ప్రీమియర్ లీగ్
హైదరాబాద్, జూన్ 26: రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో హైదరాబాద్ హీరోస్ ఆధిపత్యం కొనసాగుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెటుకుంది. తాజాగా కోల్‌కతా బంగా టైగర్స్‌తో మ్యాచ్‌లో 28 ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే వేగవంతమైన దాడులతో హైదరాబాద్ హీరోస్ ఆధిపత్యం చెలాయించింది.
ప్రారంభ నిమిషాల్లోనే సుమిత్ రాయ్ తొలి ట్రై సాధించగా, ఎడమ వింగ్‌లో రవువామా సెరువాకులా చాకచక్యమైన డమ్మీతో ప్రత్యర్థిని మోసం చేసి రెండో ట్రై నమోదు చేసి హైద రాబాద్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. తర్వాతి క్వార్టర్లోనూ హైదరాబాద్ దూకుడుగా ఆడింది. హైదరాబాద్ హీరోస్ ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజయాన్ని అందుకుంది.






