7 March, 2026 | 6:19 AM

హుజూర్‌నగర్, కోదాడ రోడ్లకు మహర్దశ

07-03-2026 01:58 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నిధుల మంజూరు

హుజూర్ నగర్/ కోదాడ, మార్చి 6 (విజయక్రాంతి): సూ ర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గంలోని పలు సింగిల్ లైన్ రోడ్లను రాష్ట్ర పౌర సరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపిన ప్రత్యేక చొరవతో ప్రభుత్వం డబుల్ లైన్ రోడ్లుగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది.దీంతో మంత్రి ఉత్తమ్ మరో మారు అభివృద్ధి మారుని చాటుకున్నారు. పాలనా పరమైన అనుమతులతో పాటు ప్రభుత్వం మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ కింద జీవో 137 ద్వారా రూ.62 కోట్లు జీవో 138 ద్వారా రూ.68 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిలో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో రూ.62 కోట్లతో డబుల్ రోడ్డు, అలాగే కోదాడ నియోజకవర్గ పరిధిలో రూ.68 కోట్లతో డబుల్ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలు, నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే పద్మావతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.