11 July, 2026 | 2:08 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

మూసీ వంతెన సమీపంలో భారీ గుంతలు

30-10-2025 08:26 AM

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

వలిగొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని(Valigonda Mandal Center) మూసీ వంతెన(Musi Bridge) సమీపంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో బీటీ రోడ్డు ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు భారీ గుంతలను తప్పించలేక ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించకపోవడంతో అందులో పడి పలు వాహనాలు దెబ్బతినడం జరిగింది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే గుంతలు మరింత పెద్దవై ప్రాణ నష్టం సంభవించక ముందే అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చివేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.