హెచ్పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్
డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 24: హెచ్పీవీ టీకాతో మహిళల్లోని గర్భాశయ క్యాన్సర్ కు పూర్తిగా చెక్ పెట్టవచ్చని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.శుక్రవారం అర్వపల్లిలోని పీహెచ్సీని సందర్శించి హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌమారదశ బాలికలకు టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో వ్యాధి రాకుండా కట్టడి చేసే అవకాశం ఉందన్నారు.బాలికలందరికి వారి తల్లిదండ్రుల ఆమోదంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితంగా ఇస్తామన్నారు.
అనంతరం అంటు వ్యాధులు కానీ వ్యాధులు(ఎన్సీడీ)స్క్రీనింగ్ ను మెరుగుపరచాలని,30 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం,అధిక రక్తపో టు,క్యాన్సర్ వంటి వ్యాధులపై స్క్రీనింగ్ పెంచి ఎన్సీడీ పోర్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్ నాయక్,సీహెచ్‌ఓ బిచ్చునాయక్, ఎన్డీసీ సూపర్వైజర్ కృష్ణ,వైద్యసిబ్బంది లలిత,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






