25 April, 2026 | 6:03 AM

చేనేత హక్కుల సాధన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్.రమణ

25-04-2026 01:15 AM

చౌటుప్పల్, ఏప్రిల్ 24 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా చేనేత హక్కుల సాధన సభ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ రమణ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే పరిశ్రమ చేనేత పరిశ్రమనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు.

అలాగే గత ప్రభుత్వంలో పెట్టిన    థ్రిప్ట్ పథకాన్ని నూలుపై 20 శాతం సబ్సిడీని ఈ ప్రభుత్వం కొనసాగించాలని చేనేత సహకార సంఘాలు ఎన్నికలను వెంటనే నిర్వహించి చేనేత పరిశ్రమలు పునరుద్దించాలని కోరారు. చేనేత నాయకులు రాజకీయంగా ఎదగాలని రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి  సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, చేనేత సంఘ నాయకులు పాల్గొన్నారు.