25 April, 2026 | 2:50 AM

ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

25-04-2026 01:12 AM

చిట్యాల, ఏప్రిల్ 24 : మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంను గ్రామీణ కూలీలు సద్వినియోగం చేసుకోని ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జింజి రాజు, పంచాయతీ కార్యదర్శి శారద, ఫీల్ అసిస్టెంట్ మల్లేష్ పాల్గొన్నారు.