నాగిరెడ్డిపేటలో 20 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హెచ్పీవీ వ్యాక్సిన్ 14 సంవత్సరాల బాలికలకు ఇవ్వడం జరిగిందని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన్ కుమార్ మాట్లాడుతూ...హెచ్పీవీ వ్యాక్సిన్ 14 సంవత్సరాల బాలికలకు ఇవ్వడం వల్ల రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్త కోసం ఉపయోగపడుతుందన్నారు.
శనివారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో 20 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని 14 సంవత్సరాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్,నాగిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ మన్నె వెంకట్,డాక్టర్ సృజన్ కుమార్,సూపర్వైజర్ సునంద,సుభాషిని మరియు డిఈఓ.బాలకృష్ణ,మెయిల్ అసిస్టెంట్ మురళీకృష్ణ, ఏఎన్ఎం సంగీత,అటెండర్ అశ్వక్ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.






