3 July, 2026 | 2:17 AM

గుడుంబా విక్రయాలు మానేసిన కుటుంబాలకు ఇండ్ల పట్టాలు

03-07-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూలై 2 (విజయక్రాంతి): గతంలో గుడుంబా విక్రయించిన కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందులో భాగంగా అర్హులైన కుటుంబాల వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను అందించింది. గోషామహల్ లోని జాంబాగ్ స్పోరట్స్ కాంప్లెక్స్ లో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు.

వారితో కలిసి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. త్వరలోనే నగరవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. ఈ కారక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.