హౌసింగ్ బోర్డ్ వరద కాలువ సమస్య పరిష్కరించాలి
20-05-2026 12:09 AM
జమ్మికుంట మే 19 (విజయక్రాంతి): జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద కాలువ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బిజెపి 6వ వార్డు అధ్యక్షుడు ఎండి జాహిద నసీరోద్దీన్ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కు వినతిపత్రం అందజేశారు. వరద నీటితో వర్షాకాలం హౌసింగ్ బోర్డ్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరద కాలువ నిర్మా ణానికి నిధులు మంజూరు చేయించాలని వినతి పత్రంలో కోరారు.






