28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి

28-04-2026 05:44 PM

నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న మహాదేవ్ తండాకు బోరు ఏర్పాటు

గ్రామస్తుల నుంచి ఘన సన్మానం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా పరిధిలో గల మహాదేవ్ తండాలో తీవ్రమైన నీటి కొరత నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం రోజూ కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను మాజీ జడ్పిటిసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి దృష్టికి తీసుకెళ్లారు.

సమస్య తీవ్రతను గుర్తించిన ఖాద్రి వెంటనే స్పందించి, తన అల్లుడి ద్వారా మంగళవారం మహాదేవ్ తండాకు బోరు వాహనాన్ని పంపించారు.బోరు తవ్వకాలు చేపట్టడంతో తండావాసుల నీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభించిందనీ, ఆయన చేసిన సేవను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్య నాయక్, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, తండా ప్రజలు పాల్గొన్నారు.