విండీస్ వన్డే జట్టులోకి హెట్‌మెయిర్
02-06-2026 01:34 AM
జమైకా, జూన్ 1: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ బెర్తు లక్ష్యంగా పెట్టుకున్న వెస్టిండీస్ సొంతగడ్డపై వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కోసం సెలెక్టర్లు షా య్ హోప్ సారథిగా 15 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. సీనియర్లు రోస్టన్ ఛేజ్, జైడన్ సీల్స్, యువ పేసర్ షమర్ జోసెఫ్‌లను సెలెక్టర్లు తీసుకున్నారు.
ఐపీఎల్ 19వ సీజన్లో తేలి పోయిన హెట్‌మెయిర్, రూథర్‌ఫస్ట్‌ల కు జట్టులో చోటు దక్కింది. ప్రపంచకప్ బెర్తు సాధించాలనే పట్టుదలతో ఉన్న వెస్టిండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకను ఢీ కొట్టనుం ది. దీంతో సెలెక్టర్లు 15 మం దితో కూడిన స్క్వాడ్‌ను ఎం పిక చేశారు. టాపార్డర్‌లో అగ స్టే, క్యాంప్‌బెల్, కేసీ కార్టీ ఎంపికయ్యారు.






