calender_icon.png 12 February, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య భరోసా!

12-02-2026 01:18:59 AM

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం?

  1. ఇకపై ఉద్యోగుల ఆరోగ్య సేవల్లో మార్పులు
  2. కొత్త విధానానికి రంగం సిద్ధం చేస్తున్న సర్కార్
  3. వచ్చే మార్చి నుంచి అమలు చేసే యోచన?
  4. ఉద్యోగుల మూలవేతనం నుంచి 1.5 శాతం నగదు భాగస్వామ్యం
  5. నేడు సీఎస్ నేతృత్వంలో కీలక సమావేశం
  6. ప్రభుత్వం ముందుకు ఉద్యోగ సంఘాల డిమాండ్లు
  7. సమావేశ అనంతరం రానున్న స్పష్టత 

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు అమలవుతున్న ఆరోగ్య సేవల్లో మార్పులకు ప్రభు త్వం శ్రీకారం చుట్టబోతోంది. పాత ఆరోగ్యశ్రీ విధానంలో నెలకొన్న లోపాలు, ఆసు పత్రుల బకాయిల సమస్యలు, రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి అంశాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ‘ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీం’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 

ఆరోగ్యశ్రీ అమలులో ఇబ్బందులు

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలను రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందిస్తున్నారు. అయితే, అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా యని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం, కార్డులు చెల్లుబాటు కావడంలో సమస్యలు, ముందుగా ఖర్చు చేసి రీయింబర్స్‌మెంట్ కోరితే పూర్తి మొత్తం రాకపోవడం, అనుమతుల ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యల వల్ల అత్యవసర వైద్యం సమయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడు

తు న్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పథకాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతత్వంలో గురువారం సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో, ఆర్థిక శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు, పలు ఉద్యోగ సంఘాల నాయ కులు ఈ భేటీలో పాల్గొననున్నారు. కొత్త పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, అమలు విధానం, ఆర్థిక నిర్వహణపై ఈ సమావేశంలో తుది రూపురేఖలు ఖరారయ్యే అవకాశముంది.

ఉద్యోగుల మూలవేతనం నుంచి 1.5%

కొత్త పథకంలో ఉద్యోగుల మేలవేతనం నుంచి 1.5 శాతం నగదు భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉదాహరణకు.. రూ.40,000 బేసిక్ ఉంటే -- నెలకు రూ.600, రూ.50,000 బేసి క్ ఉంటే -- నెలకు రూ.750, రూ. 60,000 బేసిక్ ఉంటే -- నెలకు రూ. 900 మొత్తా న్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ‘ఎంప్లా యీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ ఖాతా లో జమ చేయనున్నారు. ప్రభుత్వం కూడా సమానంగా లేదా అదనపు భాగస్వామ్యాన్ని కల్పించే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

దీంతో పథకానికి స్థిరమైన నిధుల వనరులు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రారంభంలో ఈ పథకాన్ని బీమా మోడల్‌లో అమలు చేయాలని ఆలోచించినప్పటి కీ, తర్వాత ట్రస్టు విధానాన్నేకొనసా గించాలని నిర్ణయించారు. బీ మా కంపెనీలకు అప్పగిస్తే క్లెయి మ్ సెటిల్‌మెం ట్, కవరేజీ పరిమితులు వంటి అంశాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ట్రస్టు మోడల్‌లో ఉంటే ప్రభుత్వ పర్యవేక్షణలోనే నిధుల వినియోగం, ఆసుపత్రుల ఎంపిక, రేట్ల ఖరారు జరుగుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

పథకానికి మద్దతు తెలుపుతున్నా..

ఉద్యోగ సంఘాలు కొత్త పథకానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడుతున్నాయి. అత్యవసర చికిత్సలకు వెంటనే అనుమతి, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పూర్తి క్యాష్‌లెస్ సదుపాయం, రీయింబర్స్‌మెంట్ గరిష్ఠ పరిమితి పెంపు, విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు, పాత బకాయిల క్లియరెన్స్ వంటి అంశాలపై నేటి సమావేశంలో స్పష్టత కోరనున్నాయి. సమావేశం అనంతరం మార్గదర్శకాలు విడుదల చేసి, దశలవారీగా అమలు ప్రారంభించే అవకాశముంది.

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వవర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతంలో భాగస్వామ్యం ఉండటం వల్ల పథకం ఆర్థికంగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ, అమలు పారదర్శకంగా ఉంటేనే ఫలితం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పాత పథకంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా కచ్చితమైన యం త్రాంగం అవసరమని సూచిస్తున్నారు. నేటి కీలక సమావేశం తర్వాత కొత్త ఆరోగ్య పథకానికి పూర్తి రూపు దిద్దుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఇది నిజమైన భరోసాగా మారుతుందా? అన్నది అమలుపై ఆధారపడి ఉంటుంది.