13 May, 2026 | 9:58 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

గడ్డివాము దగ్ధం..

16-12-2025 06:25 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం విజయపురి 18వ డివిజన్ లో అస్తపురం కొండగట్టు అనే రైతు యొక్క గేదెల మేతకు కొనుగోలు చేసిన సుమారు ముప్పైవేల రూపాయల గడ్డివాము అకస్మాత్తుగా నిప్పు అంటుకొని కాలిపోయింది. కాలిపోయిన గడ్డివామును బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి సందర్శించి ఏ విధంగా కాలిపోయిందని రైతును అడిగి తెలుసుకున్నారు. జాడి బాల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతును ఆదుకోని నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. సందర్శించిన వారిలో అస్తపురం లింగయ్య, గోదారి నరేష్, విద్యాసాగర్, గొల్ల రాజు ఉన్నారు.