15 May, 2026 | 11:36 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

'వైట్ కాలర్' టెర్రర్ మాడ్యూల్.. హర్యానా మతబోధకుడి అరెస్ట్

12-11-2025 11:50 AM

న్యూఢిల్లీ: ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంతో(Al-Falah University) సంబంధం ఉన్న హర్యానాలోని మేవాట్‌కు చెందిన ఒక బోధకుడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు(Jammu Kashmir Police) బుధవారం ఆ విశ్వవిద్యాలయం నుండి పనిచేస్తున్న 'వైట్ కాలర్' ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మత ప్రబోధకుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఎర్రకోట వద్ద పేలుడు(Red Fort Blast) ఘటనలో మత ప్రబోధకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్ ఫలా విశ్వవిద్యాలయ సముదాయంలోని అద్దె ఇంట్లో ఉంటున్న మౌల్వీ ఇష్తియాక్‌ను శ్రీనగర్‌కు తీసుకువచ్చారు.

ఉగ్ర డాక్టర్ ముజిమ్మిల్(Dr. Muzammil) ఇతని ఇంట్లోనే పేలుడు పదార్థాలు నిల్వఉంచాడు. ఇష్తియాక్ ఇంటి నుండి పోలీసులు 2,500 కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారని, పేలుడు పదార్థాలను డాక్టర్ ముజమ్మిల్ గనై అలియాస్ ముసైబ్, 12 మంది మృతి చెందిన పేలుడు పదార్థాలతో నిండిన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ అతని అద్దె నివాసంలో నిల్వ చేశారని అధికారులు తెలిపారు. దర్యాప్తు అధికారులు ఎర్రకోట కారు పేలుడుతో ఉగ్రవాద మాడ్యూల్‌ను అనుసంధానించి రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన రహదారులపై వాహనాలు విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా యూనిట్లు, ప్రత్యేక విభాగాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇంటెలిజెన్స్, బ్యూరో, పారామిలిటరీ దళాలతో ఢిల్లీ పోలీసులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.