ఘర్ తిరంగా – ప్రతి ఇంటా దేశభక్తి
బోధన్,(విజయక్రాంతి): తిరంగా మన జాతీయ గౌరవానికి ప్రతీక.. దేశ ఐక్యతకు చిహ్నం బీజేపీ అధ్యక్షుడు సిర్ప సుదర్శన్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలం కల్దురికి గ్రామంలో బుధవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బోధన్ మండల బీజేపీ అధ్యక్షుడు సిర్ప సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “తిరంగా మన జాతీయ గౌరవానికి ప్రతీక, దేశ ఐక్యతకు చిహ్నం. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. ప్రతి హృదయంలో దేశభక్తి నిండాలి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, జాతీయ జెండా పట్ల గౌరవాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కల్దురికి గ్రామంలో జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సేవ వంటి సందేశాలను ప్రజలకు చాటిచెప్పారు.






