14 June, 2026 | 4:28 AM

డీఎన్టీలుగా గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

14-06-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం

ముషీరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 51 సంచార, అర్ధ సంచార కులాలను డీనోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ కమ్యూనిటీలుగా (డిఎన్టీఎస్) గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెం.10ను తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం స్వాగతించింది. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్  ప్రెస్ క్లబ్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. శ్రీనివాస్ తిపిరిశెట్టి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ పాల్గొని మాట్లాడారు.

సంచార జాతుల హక్కుల సాధనలో ఇది చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. కేంద్ర డీఎన్టీ డెవలప్మెంట్ బోర్డు సిఫారసులు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం, బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, సీఈఓ అలోక్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే రాష్ట్రంలో ప్రత్యేక డీఎన్టీ కమిషన్ ఏర్పాటు, 51 కులాలకు10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు, ఎంబీసీ కార్పొరేషన్ను డీఎన్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్గా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ సమావేశంలో సీ. శ్రీనివాస్, వై.వెంకట నారాయణ, పి .సమ్మయ్య, ఎస్. రవీందర్, పి. నాగేశ్వర్ రావు, యువరాజ్, కే. శివకుమార్, జి. సత్యనారాయణ, మోహన్ చౌహన్, ఎం. భూపతి, సింహాద్రి, కృష్ణ, మందుల రమేష్ పాల్గొన్నారు.