3 April, 2026 | 8:05 PM

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

03-04-2026 05:52 PM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారికంగా ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ఆ మహానీయుడికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ అధికారులు, కురుమ సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన త్యాగం ప్రజల హక్కుల కోసం జరిగిన గొప్ప పోరాటానికి ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, కురుమ సంఘం ట్రస్ట్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎగుర్ల అశోక్, మహిళా అధ్యక్షురాలు కర్రె పావని, మీసా రమాదేవి, బీసీ సంఘం నాయకురాలు గుంటి స్వరూపతో పాటు కురుమ సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.