3 April, 2026 | 7:57 PM

ఘనంగా గుడ్ ప్రైడే వేడుకలు

03-04-2026 05:59 PM

మోతె,(విజయక్రాంతి): మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో గుడ్ ప్రైడ్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఫాస్టర్ రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం కల్పించి భూమి మీద ఉన్నా సకల జీవ రాసులకు ప్రతి ఒక్కరికి బతుకు మీద ఆశ కల్పించడం కాకుండా క్రమ శిక్షణతో పాటు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నామని చెప్పారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించడం తో పలువురు భక్తులు నీళ్ళతో పాటు పాలు అరబోసి పాదాభి వందనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ లు యిర్మీయా,  లాజర్, దావీదు, కోర్నలి తిమోతి, ఎలీషా మోస, వార్డు సభ్యులు కోట సంజీవ, మనోజ్, దివ్య, రాము, యల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.