ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 02:07pm
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని అపెక్స్ సెంట్రల్ స్కూల్(Apex Central School) బయమ్మ తోట మహబూబ్ నగర్(Mahabubnagar) స్థానిక పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలను అత్యంత ఘనంగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు వేసిన శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రామారావు సార్, ప్రిన్సిపాల్ చైతన్య మేడం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






