4 September, 2026 | 3:24 PM

అమలు కానీ ఆరు గ్యారంటీల హామీలకు అడ్రస్ ఎక్కడ..?

04-09-2026 | 02:03pm

భూములు అమ్ముకొని  పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామరక్ష. ఎమ్మెల్సీ తాత మధు

అడగకుండానే వరాలు ఇచ్చిన దేవుడు కేసీఆర్.. ఆర్ జే సి కృష్ణ 

రైతు బిడ్డకే రైతుల కష్టాలు తెలుసు

మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

బిఆర్ఎస్ నాయకుల  బైక్ ర్యాలీ, వంటవార్పు కార్యక్రమం

కారేపల్లి సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు కాని 6 గ్యారంటీల(Guarantees) హామీకి అడ్రస్ లేకుండా పోయిందని ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. సింగరేణి మండలం కారేపల్లి క్రాస్ రోడ్ నందు కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిన మోసానికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆదేశాలతో వంటావార్పు కార్యక్రమాన్ని కారేపల్లి క్రాస్ రోడ్ నందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమరభేరి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ..కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారని, అడగకుండానే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అనేది మేధావుల ఆలోచనతో ఏర్పడిన రాష్ట్రం కాగా, తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమించి, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్ అని నాయకులు అన్నారు. రైతు బిడ్డగా రైతుల కష్టాలు, సమస్యలు కేసీఆర్‌కు తెలుసని, అందుకే ఆయన పాలనలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

అధికారం కోసమే కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు నేడు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని విమర్శించారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కంటే భూములు అమ్ముకోవడంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) దృష్టి పెట్టిందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వంట వార్పు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు తెలిపారు. బిఆర్ఎస్ జిల్లా నాయకులు బానోత్ మనీషా లక్ష్మీ మదన్ లాల్, లాకవత్ గిరిబాబు, బానోత్ చంద్రావతి,పొట్ల శ్రీనివాస్ రావు,కట్ట కృష్ణ, బాణాల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ లు ముత్యాల సత్యనారాయణ, ఉనేం వీరేందర్,వాంకుడోత్ జగన్, అప్పారావు,దొంకేన రవీందర్,మాజీ సర్పంచ్ కుమార్,మాజీ ఎంపీటీసీలు శంకర్ అజ్మీర రవి, అచ్చయ ,మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్ , తాత వెంకన్న ,నాగరాజు,గౌసుద్దీన్ ,వికాస్,రాజేష్,మాజీ సర్పంచులు జర్పల హచ్చు, సక్రూ , మోహన్ ,జాల సాంబ సింగరేణి మండల బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.