శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి(Shri Krishna Janmashtami 2026) పర్వదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ సంస్థాపన కోసం అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ జీవితం(history of lord sri krishna) మానవాళికి అనేక గొప్ప సందేశాలను అందిస్తుందని సూచించారు. “ఫలితాన్ని ఆశించకుండా నిష్ఠతో కర్తవ్యాన్నినిర్వర్తించడం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా, సత్యం–ధర్మం వైపు నిలబడటం వంటి శ్రీకృష్ణ పరమాత్ముడి కర్తవ్యబోధ మన జీవితాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. ఈ పవిత్ర పర్వదినం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, ధర్మనిష్ఠ, మానవతా విలువలు మరింత బలపరచాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రశాంతత, సుఖసంతోషాలు వెల్లివిరియాలి” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.






