4 September, 2026 | 3:46 PM

కట్టంగూర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

04-09-2026 | 02:31pm

కట్టంగూర్,సెప్టెంబర్ 4(విజయక్రాంతి): కట్టంగూర్(Kattangur) మండల కేంద్రంలోని తహసీల్దార్ (MRO) కార్యాలయంలో మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను(New Smart Ration Card) ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్(Bhongir MP Chamala Kiran Kumar) రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సన్నబియ్యం పొందే వెసులుబాటు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.