4 September, 2026 | 8:06 AM

ప్లానింగ్ అదుర్స్!

04-09-2026 | 06:00am
  1. టీపీవోకు ఆదాయానికి మించిన ఆస్తులు 
  2. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట అధికారి సోమయ్య 
  3.    8 ప్రాంతాల్లో ఏక కాలంలో ఏసీబీ సోదాలు 
  4. సూర్యాపేట జిల్లాలో 3.3 ఎకరాల భూమి 
  5. పలు ప్రాంతాల్లో ఐదు భవనాలు గుర్తింపు 
  6.    709 గ్రాముల బంగారం, రూ.4.63 లక్షల నగదు స్వాధీనం 
  7. బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నిల్వలు 
  8. బహిరంగ మార్కెట్‌లో 50 కోట్లకు పైనే..

సూర్యాపేట, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీవో) వీ సోమయ్య(V. Somaiya)ను ఏసీబీ అధికారులు(ACB officials) గురువారం అరెస్టు(arrest) చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.54 కోట్ల అక్రమాస్తుల(illegal assets)ను ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ ౫౦ కోట్లకు పైనే ఉం టుందని అంచనా.

నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం సోమయ్య నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించి 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిం చారు. సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో 3.3 ఎకరాల వ్యవసాయ భూమి, సూర్యాపేట, హయత్‌నగర్ పరిధిలో ఐదు భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో జీ+1 భవనం, జీ+2 భవనం, జీ+4 భవనం, ఒక పెంట్‌హౌస్, రెండు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు.

సూర్యాపేట పరిధిలో 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. బంగారం 709 గ్రాములు, వెండి 1,750 గ్రాములు, రూ.4,63,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నిల్వలు గుర్తించారు. 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,750 గ్రాముల వెండి ఆభరణాల విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. సోమయ్యకు చెందిన రెండు కార్లు, మూడు బైకులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25.20 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేశారు.

బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా సుమారు రూ.49 లక్షల రుణం పొందినట్లు ఏసీబీ గుర్తించింది. అధికారులు గుర్తించిన గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3,54,36,490గా ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మార్కెట్ విలువ రూ.౫౦ కోట్లకు పైనే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా టీపీవో సోమయ్యను హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.