12 July, 2026 | 2:52 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

కోతలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు

24-04-2026 12:00 AM
  1. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
  2. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి,ఏప్రిల్23 (విజయక్రాంతి):టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తప్ప, తాలు పేరుతో క్వింటాలకు నాలుగు నుండి ఐదు కిలోల ధాన్యం కోత విధించేవారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం గొల్లపల్లి మండలం చందోలి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు.

చివరకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు, తప్ప, తాలు పేరుతో కోతలు విధించేవారని మంత్రి అన్నారు. 2023 లో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఇలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు నిషాంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.