16 March, 2026 | 9:27 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్

16-03-2026 08:11 PM

కోనరావుపేట(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన జోగు తరుణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర చికిత్స అవసరమైన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు.

నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి తరుణ్‌కు ప్రత్యేక వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి వైద్య ఖర్చుల కోసం రూ.4,50,000 విలువ గల ఎల్‌ఓసీను వెంటనే మంజూరు చేయించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.