3 July, 2026 | 4:28 AM

నిరుద్యోగులపై సర్కారు ఉక్కుపాదం

03-07-2026 01:02 AM

కేటీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న పోలీసు ఉద్యోగార్థులు 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించిన పోలీ సు ఉద్యోగాల సంఖ్యను 5వేల నుంచి 20వేలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో 20 వేల ఖాళీలు ఉంటే కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు.

గురువారం వంద లాదిమంది అభ్యర్థులు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికే షన్ కోసం రెండున్నరేళ్లుగా కోచింగ్ తీసుకుని సిద్ధం అయ్యామని, ప్రభుత్వం తూతూ మంత్రంగా నోటిఫికేషన్ వేసి చేతులు దులు పుకునే కుట్ర చేస్తుందని కేటీఆర్ దృష్టికి తె చ్చారు. అశోక్‌నగర్ చిక్కడపల్లి, దిల్‌సుఖ్‌న గర్‌లో నిరుద్యోగుల నిత్యం నిరసనలు వ్య క్తం చేస్తున్నారని, ఒకసారి మీరు అక్కడికి వచ్చి చూడాలని కేటీఆర్‌ను కోరారు.  

ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం: కేటీఆర్ 

రెండున్నర ఏళ్లుగా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 20వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. త్వరలో దిల్‌సుఖ్‌నగర్‌కు వస్తానని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.