8 July, 2026 | 8:08 PM

Breaking News

మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •  

రోడ్డు మధ్యలో నిలిచిన గూడ్స్ రైలు

02-02-2026 12:41 AM

గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం

మిర్యాలగూడ, ఫిబ్రవరి 1: పట్టణంలోని ఎఫ్సీఐ గోదాంలోకి ఆదివారం ఉదయం గూడ్స్ రైలు వచ్చింది. ఈ క్రమంలో జడ్చర్ల-కోదాడ రహదారి మీదుగా గోదాములోకి వెళ్తున్న క్రమంలో గూడ్స్ ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడి రైలు రోడ్డు మధ్యలో ఉన్న రైలు పట్టాలపై నిలిచి పోయింది.  దీంతో సుమారు గంటకి పైగా ట్రాఫిక్ కి అంతరాయము ఏర్పడింది. రైల్వే ఇంజినేర్లు వచ్చి సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసి గోదాములోకి తరలించారు. మిర్యాలగూడ గ్రామీణ ఎస్త్స్ర లక్ష్మయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ని మల్లించి క్రమబద్దిక రించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.