హైదరాబాద్: పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. సోమవారం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి తులానికి (10 గ్రాములు) రూ.80, 660కు చేరింది. గత ఐదు సెషన్లలో బంగా రం ధర రూ.1,660 వరకు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై విధించిన కారణంగా ముడి చమురు ధరలు పెరిగా యి. అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూ పిస్తున్నారు.
దీనికి తోడు వివిధ సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండడంతో పసిడి ధర విపరీతంగా పెరుగుతోంది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,550కి చేరింది. 24 క్యారెట్ల ధర రూ. 80,220 మార్క్‌ను దాటింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 80,070కి చేరింది. ఇక వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలోకు రూ.1000 పెరిగి రూ.1.02 లక్షలు పలుకుతోంది.