calender_icon.png 15 January, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కోట్లకు పెరిగిన యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు

14-01-2025 12:27:53 AM

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2024లో మన దేశంనుంచి ఐఫోన్ల ఎగుమతుతు రూ.లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఏకంగా 12.8 బిలియన్ డాలర్ల( రూ.1.08 లక్షల కోట్ల) విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఎగుమతుల్లో 42 శాతం వృద్ధి నమోదయింది. దేశీయ ఉత్పత్తి 46 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లు (రూ.48 లక్షల కోట్లు)కు చేరుకుందని తెలుస్తోంది.

దేశీయంగా తయారీ రంగాన్ని మరింతగా పరుగులు పెట్టించేందుకు అమలు చేస్తున్న‘ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం’ గణనీయమైన ఫలితాలను అందిస్తోంది. ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో ఈ పథకం సరికొత్త శిఖరాలను తాకుతోంది.

ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి కంపెనీల రాకతో 1,85,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. అందులో 70 శాతానికి పైగా స్త్రీలు ఉన్నారు. దీంతో భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు ఉన్న బ్లూకాలర్ ఉద్యోగాల సృష్టికర్తగా యాపిల్ నిలిచింది. ఇక యాపిల్ ఎగుమతులు ఇలాగే కొనసాగితే యాపిల్ 20 బిలియన్ డాలర్ల వార్షిక ఉత్పత్తినిరానున్న కొన్ని సంవత్సరాల్లోనే చేరుకుం టుందని నిపుణుల అంచనా.