calender_icon.png 14 January, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

14-01-2025 12:22:59 AM

న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. నవంబర్‌లో 5.48 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం.. డిసెంబర్ నెలలో 5.22 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్‌లో 6.21 శాతంతో 14-నెలల గరిష్ఠ్ట స్థాయికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. నవంబర్‌లో పతనమైంది.

డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా 2 -6 శాతం మధ్యకు దిగి వచ్చింది.కూరగాయలు, పప్పు ధాన్యాలు,చక్కెర, తృణ ధాన్యాల ధర లు తగ్గడం వల్లే డిసెంబర్ ఆహార ద్రవ్యోల్బ ణం గణనీయంగా దిగి వచ్చింది. కన్ఫెక్షనరీ, పర్సనల్ కేర్ ధరలు దిగి వచ్చాయి. గ్రామీణ ద్రవోల్బణం 5.76 శాతంగా ఉంటే, పట్టణ ద్రవ్యోల్బణం 4.58 శాతంగా రికార్డైంది.