5 May, 2026 | 8:35 PM

Breaking News

కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •  

మార్చి 28 నుంచి ఐపీఎల్?

28-02-2026 01:57 AM

ముంబై, ఫిబ్రవరి 27: క్రికెట్ అభిమానులు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ను ఆస్వాదిస్తున్నారు. ఇది ముగిసిన తర్వాత మూడు వారాలకు ఐపీఎల్ సందడి ఉంటుంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి అప్ డేట్ అందుతోంది.  ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28వ తేదీన ప్రా రంభం కాబోతోంది. మే 31వ తేదీన జరిగే ఫైనల్తో ముగుస్తుంది. నిజానికి, బీసీసీఐ మొదట మార్చి 26న లీగ్ ప్రారంభించాలని భావించినా, ఇప్పుడు రెండు రోజుల ఆలస్యంగా మొదలు కాబోతోంది.

ఈ విషయం ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రక టన ఇంకా వెలువడలేదు. ఈ ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్- పశ్చిమ బెంగాల్, చెన్నై సూపర్ కింగ్స్- తమిళనాడుతో పాటు అస్సాంలోని గువాహటిని రెండో హోమ్ గ్రౌండ్ గా మలచుకున్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లు ఈ ఎన్నికల కారణంగా ప్రభావితం కానున్నాయి. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడంతోనే ఐపీఎల్ షెడ్యూల్ కూడా ఆలస్యమవుతోంది. కాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే వారం సమావేశం కానుంది. మ్యాచ్ల పూర్తి షెడ్యూల్, వేదికలపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల కారణంగా కొన్ని ఫ్రాంచైజీల మ్యాచ్లు ప్రభావితమవుతాయి.